MLG: మల్లంపల్లి మండలం గుర్తూరుతండాలో ఏకగ్రీవంగా ఎన్నికైన కార్యవర్గానికి ఎన్నికల అధికారులు నియామక పత్రాలు అందజేశారు. సర్పంచ్ రాజునాయక్, ఉప సర్పంచ్ గున్నాల యాకుబ్ రెడ్డి, ఏడుగురు వార్డు సభ్యులు ఈ పత్రాలను అందుకున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు వారిని శాలువాలతో సన్మానించారు.