PPM: గరుగుబిల్లి నుంచి ఉద్దవోలు గ్రామానికి సుమారు 3 కి.మీ. మేర రోడ్డు ఉంది. ఇక్కడ రెండు చెరువుల గట్లు, పంట పొలాల మధ్య నుంచి రహదారి పొడవునా రాళ్లు తేలి తుప్పలు దట్టంగా పెరిగాయి. ఉద్దవోలు నుంచి గరుగుబిల్లి ఉన్నత పాఠశాలకు విద్యార్థులు నడిచి వెళ్తున్నారు. మార్గంలో పాముల బెడద ఉంది. రోడ్డు నిర్మించాలని ప్రజా ప్రతినిధులను స్థానికులు కోరుతున్నా ఫలితం లేదన్నారు.