PLD: వినుకొండకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుందుర్తి హనుమత్ శాండిల్య (32) విహారయాత్ర కోసం అస్సాం వెళ్లి ఈ నెల 5న రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన మృతదేహం ఆదివారం వినుకొండకు చేరుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులైన తల్లిదండ్రులు రవి, రమాదేవి తమ ఏకైక కుమారుడిని చూసి తీవ్రంగా వ్యథ చెందారు. తల్లి చేసిన బాధాకర పిలుపు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.