ATP: రాప్తాడు నుంచి శ్రీశైలం కు సోమవారం శివ దీక్ష స్వాములు పాదయాత్ర చేపట్టారు. రామేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శివ దీక్ష స్వాములు ఇరుముడిని కట్టుకొని పాదయాత్రగా బయలుదేరారు. స్వాములు మాట్లాడుతూ..రాష్ట్రంలో సకాలంలో వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండాలని, ప్రజల సుభిక్షంగా ఉండాలన్నారు.