NZB: నిజామాబాద్ జిల్లాలో గ్రామపంచాయతీల ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు వినూత్న వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు.. ఎన్నో ఏండ్లుగా తగాదాల కారణంగా దూరమైన ఓటర్ల వద్దకు నేరుగా వెళ్తున్నారు. పాత విభేదాలు, ఘర్షణలను పక్కన పెట్టి, ‘క్షమించండి’ అంటూ చేతులు జోడిస్తున్నారు.