విశాఖలోని డాల్ఫిన్ హిల్‌లో 10M ఇండోర్ ఎయిర్ రైఫిల్, పిస్టల్ షూటింగ్ రేంజ్ ఆదివారం ప్రారంభమైంది. 15 లేన్ల ఎలక్ట్రానిక్ టార్గెట్లతో అత్యాధునిక సదుపాయాలన్ని కలిగిన ఈ రేంజ్‌ను తూర్పు నౌకాదళ కమాండర్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా ప్రారంభించారు. నేవీలో కొత్తగా జాయిన్ అయిన వారికి ట్రైనింగ్, షూటింగ్ నైపుణ్యాల పెంపునకు ఇది ఉపకరించనుంది.