ATP: అనంతపురంలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. సోమవారం ఉదయం 18 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు కావడం వల్ల చలి ఎక్కువైందని ప్రజలు తెలిపారు. నగర శివారులోని పొలాలపై మంచు కమ్ముకుని, ఆ ప్రాంతమంతా ఊటీ అందాలను తలపించింది. ప్రజలు చలి నుంచి రక్షణ కోసం స్వెటర్లు, వెచ్చని దుస్తులు ధరించారు. కొందరు చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందారు.