ప్రకాశం: పొదిలి ఎన్జీవో భవన్లో గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అనంతరం నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా గౌరవ సలహాదారుడు తంగేళ్ల నాగభూషణం మాట్లాడారు. గాండ్ల తెలికుల ప్రజలు ఐకమత్యంతో ఉండాలన్నారు. గాండ్ల కార్పొరేషన్, కమ్యూనిటీ బిల్డింగ్ సాధించాలని సూచించారు.