ప్రకాశం: సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని కొమరోలు ఎస్పై నాగరాజు తెలిపారు. పోలీసులు వీడియో కాల్స్ ద్వారా విచారణ చేయడం, వీడియో కాల్స్ ద్వారా డబ్బు, వ్యక్తిగత వివరాలు సేకరించడం జరగదని తెలిపారు. డిజిటల్ అరెస్ట్ అనేది లేనేలేదని, అలాంటి కాల్స్ వచ్చినప్పుడు భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పై తెలిపారు.