AKP: రావికమతం మండలం మేడివాడలో నూకాంబిక అమ్మవారి పండుగ సందర్భంగా జరుగుతున్న కోడిపందాలపై పోలీసులు దాడులు చేశారు. సమాచారం మేరకు చేరుకున్న పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.1,780 నగదు, రెండు కోళ్లు స్వాధీనం చేసుకున్నారు. కోడిపందాలు చట్టవిరుద్ధమని, ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.