SKLM: జనసేన నరసన్నపేట ఇన్ఛార్జ్ బలగ ప్రవీణ్ కుమార్ అవినీతి రహిత పాలనకే పార్టీ కట్టుబడి ఉందన్నారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో చురుకుగా పాల్గొననున్నట్లు చెప్పారు. గ్రామం నుంచి పార్లమెంటరీ స్థాయి వరకు కమిటీల ఏర్పాటు జరుగుతోందని, క్రియాశీలకంగా పనిచేసే ఉత్సాహవంతులైన సభ్యులకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. పార్టీ బలోపేతానికి ఇవి దోహదం చేస్తాయని అన్నారు.