SRD:తన వాళ్లను కోల్పోయి దిక్కులేని దీనస్థితిలో ఉన్న ఓ వృద్ధురాలి పరిస్థితి చూస్తే అందరికి కంటతడి పెడుతుంది. కంగ్టి కి చెందిన బాయవ్వ(75)కు కూడు పెట్టేవారు లేక చేతగాని సమయంలో అర్ధాకలితో అలమటిస్తోంది. భర్త, ఇద్దరు కొడుకులను కోల్పోయింది. కోడళ్ళు పుట్టింటికి వెళ్లారు. ఈమెకు చూసుకునే వాళ్లే లేరు. కడుపులో అన్నం లేక, ఒంట్లో శక్తి లేక తిప్పలు పడుతోంది.