KRNL: రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్షలను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని డీఈవో శాంమ్యూల్ పాల్ తెలిపారు. ఈ నెల 10 తేదీ నుంచి 21 వరకు జిల్లాలోని 5 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. కర్నూలులో 3 కేంద్రాలు, ఆదోని మరియు నంద్యాల్లో ఒక్కో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.