Vijetjet Flight: ఓ మహిళలకు విమానంలో పురిటి నొప్పులు వచ్చాయి. నొప్పులతో బాధపడుతున్న ఆమెకు పైలట్ విజయవంతంగా డెలివరీ చేశాడు. తైవాన్ నుంచి బ్యాంకాక్‌కు బయలుదేరిన విమానంలో గర్భిణి ఉంది. విమానం టేకాఫ్ అయిన కొంతసమయానికి ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. బాత్రూంలో ఆమెను చూసిన సిబ్బంది విషయాన్ని పైలట్ జాకరిన్‌కు చెప్పారు. అయితే విమానం ల్యాండింగ్‌కు ఇంకా సమయం ఉంది. సమయానికి విమానంలో వైద్యులు కూడా లేరు. దీంతో తల్లిబిడ్డలను పైలట్ కాపాడాడు.
ముందు తన బాధ్యతలను కో-పైలట్‌కు అప్పగించాడు. తర్వాత సెల్‌ఫోన్ ద్వారా వైద్యులు సంప్రదించిన సూచనలతో ఆమెకు డెలివరీ చేశాడు. పైలట్‌ను తోటి ప్రయాణికులంతా ప్రశంసించారు. విమానంలో జన్మించిన ఆ చిన్నారికి సిబ్బంది స్కై అని పేరు పెట్టారు. విమానం ల్యాండింగ్ తర్వాత తల్లిబిడ్డలను వైద్య సిబ్బంది పరీక్షించారు. ఇద్దరి పరిస్థితి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.