»Hyderabad Kuala Lumpur Flight Engine Caught Fire Within 15 Minutes Of Take Off In Shamshabad Airport
Flight : హైదరాబాద్ నుంచి బయలుదేరిన పావు గంటలోనే విమానం ఇంజిన్‌లో మంటలు!
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఓ విమానం టేకాఫ్ అయిన పావుగంటలోనే సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఫ్లైట్ ఇంజన్లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత ఏమైందంటే...?
Hyderabad KualaLumpur Flight : మలేషియన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ విమానానికి భారీ ప్రమాదం తప్పింది. ఆ విమానం హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్(Hyderabad To KualaLumpur) వెళ్లడానికి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయ్యింది. టేకాఫ్ అయిన పావుగంటలోనే దానిలో సాంకేతిక లోపం తలెత్తింది. కుడిపక్క ఇంజన్లో ఉన్నట్లుండి మంటలు(Fire) చెలరేగాయి. దీంతో పైలెట్ అత్యవసర ల్యాండింగ్ కోసం విమానాశ్రయం వద్ద అనుమతి కోరారు.
ఓ వైపు మంటలు అంటుకుంటూ ఉన్నాయి. ఏటీసీ అధికారులు కొద్ది సేపు విమానాన్ని గాల్లో ఉంచమని సలహా ఇచ్చారు. ఫ్యూయల్ ట్యాంకులో ఇంధనం నిండుగా ఉండటంతో ల్యాండింగ్ టైంలో పెద్ద అగ్నిప్రమాదం సంభవించవచ్చని అంచనా వేశారు. దీంతో ఇంధనం కాస్త అయిపోయే వరకు గాల్లోనే చక్కర్లు కొట్టమని పైలెట్‌కి సమాచారం ఇచ్చారు. దీంతో అది మూడు గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొడుతూ ఉంది. ఆ తర్వాత అత్యవసర ల్యాండింగ్‌కి పర్మిషన్ ఇచ్చారు. దీంతో వెంటనే ఆ విమానం తిరిగి ల్యాండ్ అయ్యింది. ఈ సమయంలో దానిలో మొత్తం 138 మంది ప్రయాణిస్తున్నారు. అది సేఫ్‌గా కిందికి ల్యాండ్ అవగానే అంతా గబగబా ఫ్లైట్ దిగి ఊపిరి పీల్చుకున్నారు. పైలెట్ ప్రమాదాన్ని ముందుగా గుర్తించడం వల్లనే ఇంత పెద్ద ప్రమాదం తప్పిందని ఎయిర్ లైన్స్ అధికారులు వెల్లడించారు.
టేకాఫ్ అయిన తర్వాత 15 నిమిషాలకే సాంకేతిక లోపం తలెత్తడంతో తిరిగి వెంటనే ల్యాండింగ్ చేయడానికి కుదురింది. అదే ఓ గంట తర్వాత ఈ లోపం తలెత్తి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ప్రయాణికులు చెబుతున్నారు. అయితే ఈ సాంకేతిక లోపానికి కారణం ఏమిటో ఇంకా తెలియరాలేదు. పూర్తి వివాలు అందాల్సి ఉంది.