»Pakistani Woman Who Gave Birth To Six Children In One Delivery
Viral News: ఒకే కాన్పులో ఆరుగురికి జన్మనిచ్చిన మహిళ
డెలివరీ అయిన ఓ మహిళ ఒకే కాన్పులో ఆరుగురికి జన్మనిచ్చింది. శిశువులందరూ ఆరోగ్యంగా ఉన్నారని, బరువు విషయంలో సాధారణ స్థితిలోనే ఉన్నారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Pakistani woman who gave birth to six children in one delivery
Viral News: ఓ మహిళ డెలివరీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఒకే కాన్పులో ఆరుమంది శిశువులకు జన్మనించింది. ఈ అరుదైన ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. సాధారణంగా ఒకే కాన్పులో కవలలు జన్మించడవ సహజం, కొన్ని సందర్భాల్లో ఎక్కువ సంఖ్యలో జన్మించిన కేసులు కూడా ఉన్నాయి. అయితే ఈమె విషయంలో ఓ పరిస్థితి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రావల్పిండికి చెందిన జీనత్ వాహీద్ అనే మహిళ ఇటీవలే డెలివరీ అయింది. ఆరుగురికి ఒకే కాన్పులో జన్మనిచ్చింది. ఈ శిశువుల్లో నలుగురు మగ, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని వైద్యులు తెలిపారు.
అయితే ఆశ్యర్యానికి గురి చేసే విశేషం ఏంటంటే తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండడం ఒక ఎత్తు అయితే శిశువులందరూ చాలా ఆరోగ్యంగా ఉండడం, అందరి బరువు కూడా సాధారణంగా ఉండడం వైద్యులను సైతం విస్మయానికి గురిచేసింది. మాములుగా ఇలాంటి సందర్భాల్లో పిల్లల్లో కొందరు చాలా సన్నగా, లేదంటే ఎదైన లోపంతో జన్మిస్తారు. కానీ వీరి విషయంలో అలా కాదు అందరి బరువు, ఎత్తు కూడా సమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. వైద్యవిధానంలో దీన్ని సెక్స్‌టప్లెట్స్ అంటారు. మాములుగా అయితే కొన్ని రేర్ సందర్భాల్లో స్త్రీలో ఆరు వేర్వేరు అండాలు ఏర్పడుతాయి. ఆ సమయంలో కలయిక వలన 6 పిండాలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఒకే పిండం ఫలదీకరణ చెంది తరువాత బహుళ పిండాలుగా విడిపోతాయని వైద్యులు చెప్పారు. మరీ జీనత్ విషయంలో ఏ రకమైన పరిస్థితి అనేది ఇంకా చెప్పాలేదు.