»Superfitation A Woman Who Gave Birth To Another Child Within Six Months A Miracle In Medical
Superfitation: ఆరు నెలల వ్యవధిలో మరో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. వైద్యశాస్త్రంలో అద్భుతం
వైద్య శాస్త్రంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఆరు నెలల వ్యవధిలో ఓ మహిళ మరో బిడ్డకు జన్మిచ్చిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఇలాంటి ఘటనలు ప్రపంచవ్యాప్తంగా కేవలం 10 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి ఈ ఘటన పదకొండవది అని వైద్యులు తెలిపారు.
Superfitation A woman who gave birth to another child within six months..a miracle in medical
Superfitation: ఓ మహిళ ఆరు నెలల వ్వవధిలోనే మరో బిడ్డకు జన్మినిచ్చింది. ఇదేలా సాధ్యం అన్న అనుమానం అందరిలో వస్తుంది. కానీ వైద్యశాస్త్రంలో ఇది అరుదైన ఘటన అని వైద్యులు తెలుపుతున్నారు. అమెరికాలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాలిఫోర్నియాకు చెందిన జెస్సికా అనే మహిళ ఆరు నెలల గ్యాప్లో రెండు సార్లు ప్రసవించింది. జెస్సికా మొదట గర్భం దాల్చిన మూడు నెలల తరువాత మరోసారి గర్భం దాల్చింది. ఒకే సమయంలో రెండు పిండాలు ఎదిగాయి. వైద్య చరిత్రలో అరుదైన ఈ పరిస్థితిని ‘సూపర్ ఫిటేషన్’(Superfitation) అని వ్యవహరిస్తారని వైద్యులు తెలిపారు. ఇలాంటి కేసులు ప్రపంచవ్యాప్తంగా కేవలం పది మాత్రమే ఉన్నాయని, జెస్సికా కేసు పదకొండవదని పేర్కొన్నారు.
సూపర్ ఫిటేషన్(Superfitation) అంటే మహిళ గర్భాశయం నుంచి విడుదలయ్యే అండం, శుక్ర కణంతో కలిసి పిండంగా మారుతంది. అక్కడితో స్త్రీలో అండం విడుదల అవడం ఆగిపోతుంది. కానీ ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో స్త్రీ శరీరం మళ్లీ అండాన్ని విడుదల చేస్తుంది. దాన్నే సూపర్ ఫిటేషన్ అంటారు. అంటే ఆ సమయంలో ఆ స్త్రీ, పురుషుడితో కలిస్తే మళ్లీ గర్భం దాల్చే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో మరో పిండం కూడా మహిళ గర్భాశయంలో ఎదుగుతుంది. దీన్ని వైద్యులు గుర్తించి జాగ్రత్త వహించకపోతే శిశువులు ప్రాణాలకే ముప్పు ఉంటుంది. అత్యంత అరుదైన ఈ కేసుల్లో గర్భందాల్చిన మహిళతో పాటు వైద్యులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కవలలు అంటే ఒకేసారి విడుదలైన రెండు అండాలు శుక్రకణాలతో కలిసి వేర్వేరు పిండాలుగా ఎదిగి కవల పిల్లలు జన్మిస్తారు.