VIRAL VIDEO : ఈ మధ్య కాలంలో యువత మరీ దారుణంగా తయారయ్యారు. ప్రాణాల్ని లెక్క చేయకుండా రీల్స్( Reels) తీసుకుంటున్నారు. అలా చనిపోతున్న వారినీ మనం ఈ మధ్య చూస్తున్నాం. తాజాగా విదేశాల్లో ఓ మహిళ రైలు పట్టాలకు ఆనుకుని రీల్స్( Reels), ఫోటోలు తీసుకోవడంలో మునిగిపోయింది. రైలు(Train) ఆమెను సమీపిస్తున్నా కదలడం లేదు. అసలు పట్టించుకోవడమే లేదు. దీంతో ఆమె ఎక్కడ గాయపడుతుందో అని లోకో పైలెట్‌కి ఆందోళన కలిగింది. ఓ రకంగా ఒళ్లు మండింది. దీంతో ఇంజన్ గుమ్మం దగ్గర నిలబడ్డాడు. రైలు ఆమెను తాకుతోందన్న సమయంలో కాలితో ఒక్క తన్ను తన్నాడు. దీంతో ఆమె వెళ్లి అంత దూరాన పడింది.
ఇన్‌స్టా గ్రాంలో పోస్ట్ అయిన ఈ వీడియో ప్రస్తుతం చాలా వైరల్‌గా మారింది. నెటిజన్లు ఎన్నో కామెడీ కామెంట్లు పెడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది చాలా కరుణతో కూడిన తన్నడం అంటూ ఒకరు కామెంట్ రాశారు. మరొకరు ఆమెకు తగిన శాస్తి జరిగిందంటూ రాశారు. ఇంకొకరు రైలు గుద్దుకుని దెబ్బలు తగిలించుకోవడం కంటే ఇది బెటర్ అన్నారు. కొందరు ఎదుగుతారు గానీ ఎందుకో..? అంటూ మరొకరు కామెంట్ చేశారు. ఎదురుగు రీల్స్ తీస్తున్నది తన బాయ్ ఫ్రెండ్ అని, అది తెలిసినా ఆమెకు చెప్పలేదని మరొకరు ఫన్నీ ఫన్నీగా రాసుకొచ్చారు. మరింకెందుకు ఆలస్యం ఆ వీడియోని మీరూ ఓ సారి చూసేయండి. కామెంట్లు చదివి ఫుల్‌గా నమ్ముకోండి.