రీల్స్ చేసి పాపులర్ అవాలనే పిచ్చితో యువత చేసే పనులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తాజాగా ఓ వ్యక్తి ఉరిపోసుకుంటూ రీల్స్ చేశాడు. ప్రమాదవశాత్తు ఉరిబిగుసుకొని మరణించాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
Viral News: యువత రీల్స్ పిచ్చి ఎప్పుడో పరాకాష్టకు చేరింది. కేవలం యువతనే నిందిస్తే కాదు వివాహితులు సైతం ఈ రీల్స్ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నారు. రీల్స్‌లో ఎలాంటి స్టంట్స్ చేస్తుంటారో చూస్తూనే ఉన్నాయి. రోడ్లపై, వాహనాలపై చాలా ప్రమాదకరమైన చోట్ల విన్యాసాలు చేస్తున్నారు. అయితే అవి అన్నిసార్లు అనుకూలంగా ఉండవు. చాలా సందర్భాలలో యువతీయువకులు రీల్స్ చేస్తూ ప్రాణాలు వదులుకున్నారు. తాజాగా ఈ రీల్స్ మోజులో పడి మరో యువకుడు బలయ్యాడు. అందరికన్న వినుత్నంగా చేయాలన్న దుర్భుద్దితో మెడకు ఉరి బిగించుకొని రీల్స్ చేసే ప్రయత్నంలో తాడు మెడకు బిగుసుకొని మరణించాడు. ఇలాంటి ఘటనలు ఎక్కువగా నార్త్ సైడ్ చోటుచేసుకుంటాయి. కానీ ఈ ఘటన తెలంగాణలో జరిగింది.
వరంగల్ జిల్లా నర్సంపేటలో ఈ విషాదసంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 23 ఏళ్ల కందకట్ల అజయ్ అదే ఊరిలోని ఓ హోటల్లో పనిచేస్తుంటాడు. అందరిలానే రీల్స్ చేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసుకొని లైక్‌లు, షేర్లకోసం ఆశపడుతుంటారు. రెండు రోజుల క్రితం తన అక్కఇంటికి వెళ్లాడు. అదే గ్రామంలో మల్లంపల్లి రోడ్డులో తన చిన్నక్క ఇల్లు ఉంటుంది. అతనికి ఓ ఆలోచన వచ్చింది. తాను ఉరివేసుకుంటున్నట్లు ఓ వీడియో తీయాలని ప్లాన్ చేశాడు. దూలానికి తాడు వేలాడ గట్టాడు. తాడును ఉరి ఉచ్చు బిగించి, ఫోన్ ఆన్ చేసిన ఎదురుగా ఫ్రిడ్జ్‌పై పెట్టాడు. ఉరికి పోజ్‌లు ఇస్తూ యాక్ట్ చేశాడు. ఆసమయంలో అనుకోకుండా తాడు మెడకు బిగుసుకుపోయింది. దాన్ని తీసే క్రమంలో కాళ్లు అటు ఇటు ఆడించాడు. కిందున్న కుర్చి పక్కన కింద పడిపోయింది. తాను ఎంత ప్రయత్నించిన తననను తాను కాపాడుకోలేకపోయాడు. బుధవారం ఉదయం దూలానికి వేలాడుతున్న అజయ్ మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు సెల్ ఫోన్ పరిశీలించగా అసలు విషయం బయటపడింది. అయితే తమ కుటుంబసభ్యులు మాత్రం తన మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.