»8 Feet Huge Crocodile Roaming On The Road Video Viral
Crocodile: రోడ్డుపై భారీ మొసలి సంచారం.. వీడియో వైరల్
భారీ వర్షాల కారణంగా నదులు పొంగి నీరు రోడ్డుమీదకు వస్తుంది. దాంతో జలచరాలు సైతం రోడ్డు మీద స్వేచ్చగా తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు 8 అడుగులు ఉండే ఓ మొసలి నడిరోడ్డు మీద తిరుగుతోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
8 feet huge crocodile roaming on the road.. Video viral
Crocodile: భారీ వర్షాల కారణంగా నదులు, జలపాతాలన్నీ పొంగిపొర్లుతున్నాయి. దాంతో జలచరాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. తాజాగా రత్నగిరి జిల్లాలోని తీరప్రాంతమైన చిప్లన్లోని చించ్ నాకా ప్రాంతంతో ఓ సంఘటన చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి దాదాపు 8 అడుగుల మొసలి రోడ్డుమీదకు వచ్చింది. వాహనాలు తిరుగుతున్న సరే అదేది పట్టించుకోకుండా దర్జాగా తిరుగుతుంది. దీన్ని చూసిన ప్రజలకు భయాందోళనకు గురయ్యారు. చాలా మంది తమ మొబైల్ ఫోన్లలో బంధించారు.
వీడియోలో చూసినట్లైతే.. రోడ్డుపై మొసలి ఠీవీగా సంచరిస్తుంది. వాహనాలు వస్తున్నాయి అన్న భయం లేకుండా స్వేచ్చగా తిరుగుతుంది. అయితే ఈ ప్రాంతంలో మొసల్లు ఎక్కువగా తిరుగుతుంటాయి. రత్నగిరి జిల్లాలో చిత్తడి నేలల ఎక్కువ. ఈ నెలల్లో మొసళ్లు అధికంగా జీవిస్తుంటాయి. వాటిని మగ్గర్స్ అంటారు. మొసల్లలో మగ్గర్స్ జాతి, ఉప్పునీటి మొసళ్లు, ఘారియల్ మొసళ్లు ఉన్నాయి. ఈ జిల్లాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షం కురుస్తుండడంతో నీళ్లు రోడ్డుమీదకు వస్తున్నాయి. దీంతో శివ నది నుంచి ఈ మొసలి కొట్టుకొచ్చిందని అటవిశాఖ అధికారులు భావిస్తున్నారు. ఇలా మొసళ్లు జనవాసాల్లోకి వస్తుండడంతో ప్రజలు భయపడుతున్నారు. దీన్ని కట్టడి చేయాలని అధికారులను కోరుతున్నారు. ఇటీవలే యూపీలో ఓ ఘటన చూశాము. దాదాపు 10 అడుగులు మొసలి ఇనుపు రెయిలింగ్ మీద నుంచి దూకేందుకు ప్రయత్నించింది. దాన్ని అధికారులు పట్టుకొని నదిలో విడిచిపెట్టారు.