»Banks To Operate 5 Days A Week Soon New Opening And Closing Times Announced
Banks : బ్యాంకులకు ఐదు రోజులే పని దినాలు.. ఎప్పటి నుంచంటే?
రానున్న రోజుల్లో దేశంలోని అన్ని బ్యాంకులు వారంలో ఐదు రోజులే పని చేయనున్నాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పని దినాలుగా మారనున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
Banks To Operate 5 Days A Week Soon : బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త. రానున్న రోజుల్లో అన్ని బ్యాంకులు ఐదు రోజులే పని చేయనున్నాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే వీటికి పని దినాలుగా ఉండనున్నాయి. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్( Indian Banks’ Association)ఎంప్లాయస్ యూనియన్ల మధ్య ఒప్పందం కుదురింది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం కూడా ఆమోద ముద్రను వేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది మొదట్లో ప్రభుత్వ దీనికి ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి.
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఓ), బ్యాంకు యూనియన్లు రెండూ ఒకే అభిప్రాయంలో ఉన్నాయి. ఆర్బీఐతోనూ ఈ విషయమై చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నాయి. ఏదేమైనా చివరిగా ప్రభుత్వ ఆమోద ముద్ర లభించాల్సిందేనని అంటున్నాయి. వారానికి రెండు రోజులు సెలవులు ఉంటే… ఉద్యోగులకు పని గంటలు పెరిగే అవకాశం ఉంది. ఉదయం 9:45 నుంచి సాయంత్రం 5 :30 గంటల వరకు బ్యాంకులు పని చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఖాతాదారుల సేవల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడవని స్పష్టతను ఇస్తున్నాయి.
ఇప్పుడున్న బంధనల ప్రకారం.. రెండు, నాలుగు శనివారాల్లో బ్యాంకులు(Banks) పూర్తిగా పని చేయడం లేదు. ప్రభుత్వం ఆమోదం తెలిపితే మిగిలిన రెండు లేదా మూడు శనివారాలు కూడా ఉద్యోగులకు సెలవు దొరుకుతుంది. నిజానికి బ్యాంకులు ఈ విషయమై 2015 నుంచి డిమాండ్ చేస్తున్నాయి. 2015లో కుదిరిన ఒప్పందం ప్రకారం.. రెండు, నాలుగో శనివారాల్లో మాత్రమే సెలవులు ఇచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్, ప్రభుత్వం అంగీకరించాయి.