»Vijay Deverakonda Reaction On His Role In Kalki 2898 Ad
kalki 2898 ad : నన్ను అలా చూడొద్దు.. అర్జునిడిగానే చూడండి : విజయ్ దేవరకొండ
పాన్ ఇండియా మూవీగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన కల్కి 2898 ఏడీ సినిమాలో అర్జునిడిగా విజయ్ దేవరకొండ కనిపించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో తన పాత్రపై విజయ్ ఏమంటున్నారంటే?
kalki 2898 ad : భారీ చిత్రంగా, బంపర్ హిట్ మూవీ టాక్ని అందుకున్న కల్కి 2898 ఏడీ(kalki 2898 ad) సినిమాలో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) అర్జునుడిగా కనిపించి అలరించారు. ఈ సినిమాలో తన పాత్ర గురించి, ఈ సినిమా గురించి ఆయన తన మనసులోని మాటల్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు తనకు చాలా ఎమోషనల్‌గా అనిపించిందని అన్నారు. భారతీయ సినిమా మరో స్థాయికి వెళ్లినట్లు అనిపించిందని తెలిపారు.
ఈ సినిమాలో నటించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. నాగీ యూనివర్స్‌లో తామంతా వివిధ పాత్రలు పోషించామని చెప్పారు. ఈ సినిమాలో నటించిన వారిని విజయ్ దేవరకొండ, ప్రభాస్(prabhas) అన్నట్లుగా చూడొద్దని అన్నారు. తనను అర్జునుడిగానే, ప్రభాస్‌ని కర్ణుడిగానే చూడమని చెప్పారు. తాను నాగ్ అశ్విన్ ప్రతి సినిమాలో చేస్తున్నని అన్నారు. అందుకు ఆయన తనని లక్కీ ఛార్మ్ అని చెబుతుండొచ్చుగాని సినిమాలు బాగుంటున్నాయి కాబట్టే జనాలు చూస్తున్నారని అన్నారు. అంతేకాని తాను నటించడం వల్ల ఆ సినిమాలు ఆడటం లేదని అన్నారు.
మహానటి, కల్కి రెండూ కూడా గొప్ప సినిమాలని విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) అన్నారు. అందులో తాము నటించాం అంతేనని అన్నారు. ‘కల్కి పార్ట్2లో విజయ్ దేవరకొండ పాత్ర నిడివి ఇంకాస్త ఎక్కువ ఉండనుందని నిర్మాత అశ్వినీదత్ చెబుతున్నారు. దానిపై మీరేమంటారు?’ అని విలేకరులు ఆయనను ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం ఇస్తూ అశ్వినీదత్ ఏది చెబితే అదే కరెక్ట్ అంటూ నవ్వేశారు.