Reels crazy stunts with the car in drunkenness.. Two died in Maharashtra
Car Accident: సోషల్ మీడియాలో రీల్స్ చేయడం అనేది వ్యాపకం నుంచి పిచ్చికి పాకింది. ఇంకా చెప్పాలంటే ఆ పిచ్చి పరాకాష్టకు చేరింది. ప్రమాదకరమైన విన్యాసాలు చేసి వైరల్ కావాలనే బుద్ది ప్రాణాలను బలికొంటోంది. ప్రతీ రోజు ఇలాంటి దారుణాలు జరుగుతున్నా ఇంకా రీల్స్ చేయడం, ప్రమాదకరమైన స్టంట్స్ చేయడం మాత్రం మానడం లేదు. తాజాగా రీల్స్ చేసే క్రమంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మహారాష్ట్రాలో జరిగిన ఈ సంఘటనపై జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. ఈ ఘటనకు సంబంధించిన దృష్యాలు నెట్టింట్లో వైరల్గా మారాయి. దీనికి కారణం ఆ యువకులు మద్యం మత్తులో ఉండడమే అని తెలుస్తుంది. క్షణం ఆనందం కోసం చేసిన ఓ పని ఇద్దరి నిండు ప్రాణాలను తీసుకుంది. ఇదే ప్రమాదంలో మరో ముగ్గురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మంగళవారం తెల్లవారు జామును జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్ర నాగ్ పూర్లోని పంజారా గ్రామ సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారులో మొత్తం ఐదు మంది యువకులు ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో వారంత ఫుల్ మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇక రీల్స్ తీయాలని కారును అతివేగంగా నడపడంతో పాటు రోడ్డుపై అటు, ఇటు డ్రైవ్ చేశారు. అదే క్రమంలో కారు అదుపుతప్పి బోల్తా పడిందని అధికారులు వెల్లడించారు. అతి వేగంతో కారు బోల్తా పడడంతో రోడ్డుపై కొంత దూరం ఈడ్చుకుపోయిందని తెలిపారు. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జుగా అయిందన్నారు. కారులో ఉన్న ఐదుగురిలో స్పాట్లోనే ఇద్దరు యువకులు మరణించారు. మరో ముగ్గిరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి అని పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అంబులెన్స్ అక్కడికి చేరుకొని.. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి సిరీయస్గా ఉందని వైద్యులు తెలిపారు.
Tragic Accident in Nagpur: 2 Dead, 3 Severely Injured After Speeding Car Crashes into Barrier
Reportedly, the driver was drunk. This accident took place on july 9.