»If The War With Ukraine Ends Putin Will Be Killed Elon Musk
Elon Musk: ఉక్రెయిన్‌తో యుద్ధం విరమిస్తే.. పుతిన్‌ను హతమారుస్తారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో వ్లాదిమిర్ పుతిన్ వెనక్కి తగ్గితే ఆయన్ను హతమారుస్తారని అన్నారు.
If the war with Ukraine ends.. Putin will be killed.. Elon Musk
Elon Musk: టెస్లా, మెటా కంపెనీ అధినేత ఎలన్ మస్క్(Elon Musk) రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్-రష్యా(Ukrain vs Russia) యుద్ధంలో వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) వెనక్కి తగ్గే అవకాశం లేదని అన్నారు. ఒక వేళా అలా తగ్గితే అతన్ని హత్య చేసినా ఆశ్చర్యంలేదన్నారు. ఎక్స్ స్పెసెస్ వేదికగా సోమవారం జరిగిన ఓ సమావేశంలో ఎలన్ మస్క్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో పుతిన్ ఓడిపోడు అని ఆయన స్పష్టం చేశారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌కు మరింత సహాయాన్ని అందించాని సేనేట్‌లో బిల్లు పెట్టిన నేపథ్యంలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయంశంగా మారింది.
ఈ వ్యాఖ్యలపై తనను చాలా మంది విమర్శిస్తున్నారని కానీ నిజాలు తెలుసుకోవాలి అని మస్క్ అన్నారు. ఉక్రెయిన్ వార్‌లో పుతిన్ ఓడిపోరని చెప్పారు. ఉక్రెయిన్ గెలుస్తుంది అనుకోవడం వాస్తవం కాదు అని అన్నారు. ఉక్రెయిన్‌కు 95 బిలియన్ల డాలర్ల సాయాన్ని అందించేందుకు అమెరికా సేనేట్‌లో బిల్లు పెండింగ్‌లో ఉన్న సందర్భంగా మస్క్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. బిల్లుకు మద్దతు ఇవ్వడం అంటే యుద్ధాన్ని ప్రొత్సహించడమే అవుతుందన్నారు. యుద్ధాన్ని కొనసాగించాలన్న ఒత్తిడి పుతిన్‌పై ఉందని, ఆయన వెనక్కి తగ్గితే పుతిన్‌ను హతమారుస్తారని మస్క్ తెలిపారు. రెండు వైపులా మరణాలు నివారించడమే తమ లక్ష్యమని తన అభిప్రాయాన్ని తెలిపారు. ఒకవేళ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను గద్దే దించాలని భావిస్తే, రాబోయే వ్యక్తి అంతకన్న కఠిన మైన వ్యక్తే అయి ఉంటాడని మస్క్ వెల్లడించారు.