»Beware Of Deepfakes Ranveer Singh Reacts Ai Video
Ranveer Singh: రణ్ వీర్ సింగ్ డీప్‌ఫేక్ వీడియో వైరల్
బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ ఓ పార్టీకి ప్రచారం చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట్ల తెగ వైరల్ అవుతుంది. అయితే అది ఫేక్ వీడియో అని తాజాగా ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
Ranveer Singh: బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్(Ranveer Singh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో హీరోగా ఎంత పాపులారిటీ సంపాదించుకున్నారో అంతకంటే ఎక్కువగా సినిమా వేడుకల్లో ఆయన ఎనర్జీతో అంత పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తిరుగుతుంది. ఓ జాతీయ పార్టీకి ఓటు వేయండి అని చెప్పె ఓ వీడియో వైరల్ అవడంతో అందరూ అది నిజమే అనుకున్నారు. తాజాగా అది డీప్ ఫేక్ వీడియో అని, ఏఐ వీడియోల పట్ల కాపాడండి అని స్వయంగా రణ్ వీర్ సింగ్ పోస్ట్ పెట్టారు. దాంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
అందాల హీరోయిన్ కృతిసనన్‌తో కలిసి రణ్ వీర్ సింగ్ వారణాసిని సందర్శించారు. ఆ సందర్భంగా ఓ జాతీయ మీడియాతో ఆయన ఆధ్యాత్మిక అనుభవాల గురించి మాట్లాడారు. విశ్వానాథ ఆలయం, వారనాసి గురించి మాట్లాడుతూ.. తన తల్లి, భార్య దీపిక పడుకొనేలతో ఇక్కడి వచ్చినట్లు వారికి కూడా ఈ ప్రదేశం అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చారు. దాన్ని ఓ రాజకీయ పార్టీకి అన్వయించి ఆ పార్టీని గెలిపించండి చెప్పినట్లు క్రియేట్ చేశారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజలు నిజమే అని నమ్మారు. దీంతో ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది వరకు కూడా అమీర్ ఖాన్, సచిన్ టెండూల్కర్ ఈ డీప్‌ఫేక్‌లకు బలైపోయారు.