»Representatives Of The Ministry Of Culture Of Russia Who Met Chiranjeevi Discussion On Movies
Chiranjeevi: చిరంజీవితో భేటీ అయిన రష్యా ప్రతినిధులు.. సినిమాలపై సుదీర్ఘ చర్చ
రష్యా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రతినిధులు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఆయనింట్లో కలిసి సుదీర్ఘంగా చర్చించారు. సినిమా షూటింగ్‌ల విషయంలో తెలుగు పరిశ్రమకు రష్యా సహకారం ఉండాలని పేర్కొన్నారు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి అందరికి తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్దన్న పాత్ర వహిస్తూ సినిమా వృద్ధి కోసం పాటు పడుతున్నారు. తాజాగా ఆయన రష్యా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో భేటీ అయ్యారు. స్వయంగా ఆయన ఇంట్లో వారు కలిశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మూవీస్‌కు సంబంధించి సుదీర్ఘంగా చర్చించారు. రష్యా దేశంలో షూటింగ్ సహకారంపై, భారతీయ సినిమా ముఖ్యంగా తెలుగు చిత్రాల షూటింగ్‌లను ప్రొత్సహించేందుకు అవసరం అయిన సహకారం అందించేందుకు తాము సిద్ధమని మంత్రిత్వ శాఖ చిరంజీవితో మాట్లాడారు.
చిరంజీవితో రష్యా సాంస్కృతిక శాఖ మంత్రికి సినిమా సలహాదారు జూలియా గోలుబెవా, క్రియేటివ్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ సెంటర్ హెడ్ ఎకటెరినా చర్కెజ్, యూనివర్సల్ యూనివర్సిటీ డైరెక్టర్ మరియా సిట్కోవ్ స్కయా వీరితో పాటు కొంత మంది సీనియర్ సభ్యులు కూడా ఉన్నారు. ప్రస్తుతం చిరంజీవి రష్యా బృందం సభ్యులతో భేటీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక చిరంజీవి ప్రస్తుతం విశ్వాంభర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. శర వేగంగా ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. త్రిష హీరోయిన్గా నటిస్తుంది.