తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి అనే పేరుకి ప్రత్యేక స్థానం హోదా ఉన్నాయి. ఆయనంటే ఎంతోమంది అభిమానులకు, స్నేహితులకు మరియు సినీ అభిమానులకు ఎంతో ప్రేమ. ప్రతి సంవత్సరం ఆగష్టు 22 వచ్చిందంటే కొన్ని కోట్లమందికి పండుగ. మెగాస్టార్ స్పూర్తితో రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి అభిమానం చాట్ వారు కొందరైతే… మెగాస్టార్ ఇంటికి సైతం వెళ్లి ఆయన్ని విష్ చేసి, తమ అభిమాన నటుడి దగ్గర ఆశీర్వాదం తీసుకునే అభిమానులు, ఇండస్ట్రీలో నటులు, టెక్నీషియన్స్ కొంతమంది. తన జన్మదినం సందర్భముగా చిరంజీవి తన ఇంట్లోనే ఉండి, అభిమానులను, స్నేహితులను కలుస్తారు, వారికి అభినందనలు స్వీకరిస్తారు అనుకుంటే ఈ సంవత్సరం ఇది విభిన్నంగా జరిగింది.
ఈ సంవత్సరం చిరంజీవి తన జన్మదినాన్ని హైదరాబాద్ లో కాకుండా తీరుమలలో కుటుంబంతో చేసుకుంటున్నారు. తరచూ తన జన్మదినం సందర్భంగా అభిమానులతో, ఆత్మీయులతో సమావేశమయ్యే చిరంజీవి ఈసారి ఒక ప్రత్యేక విమానంలో తీరుమలకి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా తన తల్లి అంజనా దేవితో కలిసి, తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్లారు.
ఈసారి ఆయన అభిమానులు కొంత నిరాశలో ఉన్నారు. తమ అభిమాన హీరోను పుట్టినరోజు నాడు కలిసే అవకాశం లేకపోయిందని బాధ వారిలో కనిపిస్తుంది. అయితే, చిరంజీవి వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లడం అతని వ్యక్తిగత జీవనంలోని పవిత్రతను, దైవికతను ప్రాధాన్యం ఇవ్వడం అనే భావాన్ని తెలియజేస్తోంది. చిరంజీవి కుటుంబంతో పాటు గడపటం, ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందటం మరింత ప్రత్యేకంగా భావిస్తారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ ప్రతీ ఏటా నిర్వహించే వేడుకలు నిన్న హైదరాబాద్ లో ప్రముఖ డైరెక్టర్ల మధ్య, యాక్టర్ల మధ్య చాలా ఘనంగా జరిగాయి