మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకమైన స్థానం ఉన్న సినిమా ‘ఇంద్ర’ . ఈ సినిమా, 4K రీ-రిలీజ్‌తో మరోసారి ఆగష్టు 22న చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా 2002లో విడుదలై, చిరంజీవి కెరీర్లో, తెలుగు ఇండస్ట్రీలో మాస్ కమర్షియల్ సినిమాలకు ఒక రిఫరెన్స్ గా నిలిచింది. అయితే, ‘ఇంద్ర’ మళ్లీ విడుదల అవుతున్న ఈ సారి, అడ్వాన్స్ బుకింగ్ కొంత స్లో గా ఉన్నట్లు కనిపిస్తుంది.
ఆగష్టు 9న, మహేష్ బాబు ‘మురారి’ సినిమాను రీ-రిలీజ్ చేసినప్పుడు విశేష స్పందన వచ్చింది. ప్రత్యేకంగా నగరాలు, పట్టణాలు, చిన్నచిన్న నగరాలలో మంచి రెస్పాన్స్ వచ్చింది. మహేష్ బాబు అభిమానులు, ఈ సందర్భంగా పెద్దగా సెలబ్రేషన్ చేసారు, ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు కూడా దీనిని పండగలా జరుపుకున్నారు. థియేటర్లు పెళ్లి మండపాలుగా మారిన వీడియోలు వైరల్ అయ్యాయి.
‘ఇంద్ర’ విషయానికి వస్తే.. పలు మాస్ సెంటర్లలో మంచి ప్రదర్శన ఇచ్చేలా కనిపిస్తుంది. మురారితో పోలిస్తే ఇంద్రకు అడ్వాన్స్ బుకింగ్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఫుల్ రన్ మాస్ సెంటర్లలో థియేటర్ కౌంటర్ బుకింగ్‌పై ఆధారపడి ఉంటుంది. థియేటర్ వాకిన్స్ పైనే ఎక్కువ ఆధారపడి ఉన్నట్టు కనిపిస్తుంది. అక్కడ బాగా పెర్ఫర్మ్ చేయకపోతే మెగాస్టార్ అభిమానులకు ఇంద్ర నిరాశ కలిగించవచ్చు. మురారితో పోల్చడం పక్కనపెడితే సీనియర్ హీరోల్లో రి రిలీజ్ చిత్రాలు చూస్తే ఇంద్ర టాప్ ప్లేస్ అనే చెప్పాలి. ఇప్పటికే బుక్ మై షో లో 40 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి.