తమిళ ఇండస్ట్రీ కోలివుడ్ లోనే కాక యావత్ భారత దేశంలో సినీ ప్రేక్షకుల హృదయాలను గెలిచాడు విజయ్. నటుడు విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో కీలక ఘట్టం అయిన జెండా ఆవిష్కారణకు నాశ్రీకారం చుట్టారు. తన కొత్త రాజకీయ పార్టీ ‘తమిళగ విజేత కలుగమ్’ జెండాను ఆగస్టు 22న ఆవిష్కరించబోతున్న విజయ్, ఇప్పటికే ఈ పేరుతో గత ఫిబ్రవరిలో పార్టీని ప్రకటించాడు. ఈ పార్టీ 2026 తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తుంది అని విజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
విజయ్, తమిళనాడులో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించడం ద్వారా తమ అభిమానులను, రాజకీయ వర్గాలను, ప్రజలను ఆకర్షించాలని ఆశిస్తున్నారు . ఇటీవల, విజయ్ తాజా చిత్రం ‘గోట్’ ట్రైలర్ విడుదల అయింది, ఈ సినిమాను సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రం తరువాత, విజయ్, దర్శకుడు వినోద్ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తారని సమాచారం. ఈ సినిమా తరువాత, విజయ్ తన నటనకు వీడ్కోలు చెప్పే అవకాశముంది.
విజయ్ అభిమానులు, తమిళనాడు ప్రజలు విజయ్ రాజకీయ పార్టీ పట్ల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ప్రస్థానం ఎలా ఉంటుందో, తమిళ ప్రజలు ఆయన చిత్రాలను ఆదరించినట్టు రాజకీయ భవిష్యత్తు కూడా ఇస్తారో లేదో చూడాలి. గతంలో రజనీకాంత్ పార్టీ ప్రకటించినా, ఆయన వ్యక్తిగత మరియునా ఆరోగ్య కారణాల వల్ల ఉపసంహరించుకున్నారు. కమల్ హాసన్ మాత్రం ఇంకా పార్టీను నడుపుతున్నారు. కమల్ విజయ్ కి మద్దత్తు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తమిళ రాజకీయ వర్గాలలో చర్చ ఎప్పటినుంచే ఉన్నదే