మద్రాస్ హైకోర్టు(Madras High Court)లోని మధరై ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళనాడులోని తెన్ కాసి జిల్లాలోని కడయం పోలీస్ స్టేషన్ లో ఇన్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న పి.శరవణను తన భార్య ప్రసవానికి తనకు లీవ్ కావాలని ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. డెలివరీ (Delivery) సమయంలో తాను ఆమె పక్కన ఉండేందుకు మే 1 నుంచి 90 రోజులు సెలవులు కావాలంటూ శరవణ్ (Saravan) ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై ఉన్నతాధికారులు మొదట సెలవులు మంజూరు చేయటానికి అంగీకరించారు. కానీ తరువాత కుదరదు అని తేల్చి చెప్పింది. దానికి సంబంధించి మోమో జారీ చేశారు. దీంతో శరవణన్ మద్రాస్ హైకోర్టులోని మధురై ధర్మాసనాన్ని ఆశ్రయించారు.
దీనిపై విచారించిన ధర్మాసనం ప్రసూతి (Obstetrics)సమయంలో భార్య బాగోగులను చూసుకోవాల్సిన అవసరం భర్తకు ఉందని, కాబట్టి ఆయన సెలవు దరఖాస్తును పరిశీలించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్‌దారుడు బాధ్యతాయుతమైన భర్తగా వ్యవహరించారని..కాబట్టి ఆయనకు ఇచ్చిన మెమోను రద్దు చేస్తున్నట్టు పేర్కొంటూ మెమోను రద్దు చేస్తూ జస్టిస్ ఎల్. విక్టోరియా గౌరీ (L. Victoria Gowrie) నేతృత్వంలోని ధర్మాసంన ఉత్తర్వులు జారీ చేసింది. కానీ అధికారులు సెలవు ఇవ్వటానికి అంగీకరించలేదు. దీంతో సదరు ఇన్పెక్టర్ కోర్టును ఆశ్రయించారు. తాను పక్కన ఉంటే తన భార్య (Wife) ధైర్యంగా ఉంటుందని భర్తగా అది తన బాధ్యత అంటూ తనకు సెలవు మంజూరు చేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతు కోర్టుకు విన్నవించుకున్నాడు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం భార్య ప్రసవానికి భర్తకు సెలవు ఇవ్వాల్సిందేనంటు తీర్పునిచ్చింది