Mini Jamili Elections: జమిలీ ఎన్నికలపై (Jamili Elections) ఎన్డీఏ ప్రభుత్వం వెనకడుగు వేసింది. పలు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ కష్టం అని భావించింది. మినీ జమిలీపై మాత్రం దృష్టిసారించింది. ఈ ఏడాది నవంబర్ నుంచి వచ్చే ఏడాది నవంబర్ వరకు 12 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్లో లోక్ సభ ఎన్నికలు ఉన్న సంగతి తెలిసిందే. సో.. అన్నీ కలిపి.. మినీ జమిలీ ఎన్నికలు (mini Jamili Elections) నిర్వహించాలని యోచిస్తోంది.
నవంబర్, డిసెంబర్లో తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరం ఎన్నికలు జరగాల్సి ఉంది. వచ్చే ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ నెలలో లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి. వీటన్నింటినీ కలిపి.. మినీ జమిలీగా నిర్వహించాలని ఎన్డీఏ భావిస్తోంది. వీటిలో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ముందస్తు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అంగీకారం తెలుపుతారని బీజేపీ భావిస్తోంది. మహారాష్ట్ర బీజేపీ సంకీర్ణం ఉండగా.. హర్యానాలో బీజేపీ.. జమ్ములో రాష్ట్రపతి పాలన ఉండగా.. అక్కడ ఎన్నికల నిర్వహణ ప్రతిబంధకంగా మారే అవకాశం లేదు.
మినీ జమిలీకి (mini Jamili) ఏపీ సీఎం జగన్ అంగీకరించారట.. అందుకే బహిరంగ సభల్లో విమర్శల వేడి పెంచారని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకోసమే అభ్యర్థుల జాబితా కూడా రెడీ చేశారని తెలుస్తోంది. వివిధ కారణాలతో సిట్టింగుల్లో 16 మందికి టికెట్ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయగా.. కాంగ్రెస్ 60 మందితో తొలి జాబితా విడుదల చేయనుందని తెలిసింది. కర్ణాటక ఎన్నికలతో బీజేపీ ప్రభ తగ్గింది. మోడీ గ్రాఫ్ కూడా పడిపోతుంది. అన్నీ అంశాలను ఆలోచించి మరీ మినీ జమిలీకి వెళ్లాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది.
మినీ జమిలికి (mini Jamili) అన్ని రాష్ట్రాలు అంగీకారం తెలుపాలి. బీజేపీ, సంకీర్ణ ప్రభుత్వాలు ఓకే.. మిగతా రాష్ట్రాలపై సందేహాం ఉంది. అలాగే ఏప్రిల్లో లోక్ సభ ఎన్నికలను.. రెండు నెలల ముందుకు తీసుకురావడంపై కూడా ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. బీజేపీ ఆలోచన చేసింది.. కానీ అమలు చేయడంలో ఇబ్బందులు తప్పేలా లేవని విశ్లేషకులు అంటున్నారు.