ఆసిఫాబాద్: జిల్లాలో సంక్రాంతి సందర్బంగా పేకాట, కోడిపందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని SP నితికా పంత్ ఇవాళ ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వాహన తనిఖీలు, ముమ్మరం చేశామన్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దు పోలీస్ స్టేషన్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఎవరికైనా సమాచారం తెలిస్తేడయల్ 100కి ఇవ్వాలన్నారు.