ADB: జిల్లాలోని ప్రధాన సాగునీటి, తాగునీటి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారని డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ తెలిపారు. హైదరాబాద్లో మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సంజీవ రెడ్డితో కలిసి మంత్రిని కలిశారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణపై మంత్రికి వినతిపత్రం అందజేశారు.