SRD: జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా డెక్కన్ టోల్ ప్లాజా లిమిటెడ్ (DTPL) ఆధ్వర్యంలో శనివారం జాతీయ రహదారి–65పై ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనదారుల కోసం విస్తృత స్థాయిలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాహనదారులు తప్పనిసరిగా పాటించాల్సిన రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.