The date of Telangana assembly sessions is finalised.. The budget will be presented today
Telangana assembly: తెలంగాణలో శాసనసభ, శాసన మండలి సమావేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. జూలై 23 నుంచి శాసనసభ, 24 నుంచి శాసనమండలి సమావేశాలు ప్రారంభం అవుతాయి. అసంబ్లీ సమావేశాల సందర్భంగా జులై 25 లేదా 26వ తేదీన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనన్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్దం అవుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఏర్పడిన తరువాత పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సమయం లేకపోవడంతో జనవరిలో మధ్యంత ఆర్థిక బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. ఇక ఇప్పుడు పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
మొత్తం పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళిక చేస్తోంది. దీనిలో భాగంగా రైతు భరోసా, కొత్త ఆర్ఓఆర్ చట్టం, తెలంగాణ లోగో మార్పు, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుతో పాటు పలు బిల్లులపై చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏఏ శాఖలు బడ్జెట్ ఎంత కేటాయించాలని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆయా శాఖల అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో విక్రమార్క అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక రాష్ట్రంలోని సంక్షేమ పథాకాలపై ఎంత బడ్జెట్ కేటాయిస్తారు అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.