»Heavy Rain In Khammam District 3 Feet Water In Cherla National High Way
Heavi rains : భారీ వర్షం కారణంగా భద్రాచలం నుంచి నిలిచిపోయిన రాకపోకలు
భద్రాచలం దగ్గర కురిసిన భారీ వర్షాలకు ఆ ప్రాంతంలో రాకపోకలు బంద్ అయ్యాయి. చర్ల జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
Heavy Rain In Khammam District : రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాలు భారీగా ఉన్నాయి. చర్ల జాతీయ రహదారిపైకి ఎక్కువగా వరద నీరు చేరిపోయింది. దీంతో భద్రాచలం మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల ఈదురు గాలులు, చెట్లు విరిగిపడటం, విద్యుత్ స్తంభాలు కూలడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఖమ్మం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో విద్యుల్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.
చర్ల జాతీయ రహదారిపై వర్షాల కారణంగా దాదాపుగా మూడు అడుగుల మేర వర్షపు నీరు చేరిపోయింది. చర్ల, దమ్ముగూడెం మండలాల ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు రాకపోకలు ఇబ్బందికరంగా తయారయ్యాయి. మూడు రోజుల పాటు భారీ వర్షాలు( Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఈ వర్షాలు మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండొద్దని హెచ్చరిస్తున్నారు. మరీ అవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు.