»A Tribe That Wanders In The Forests Of Amazon The Video Is Viral
Amazon forest: అమెజాన్ అడవుల్లో సంచరించే తెగ.. వీడియో వైరల్
బయట ప్రపంచానికి తెలియకుండా జీవించే తెగలు ఇంకా చాలానే ఉన్నాయి. అమెజాన్ లాంటి అతిపెద్ద అడవుల్లో చాలా తెగలు ఉన్నట్లు ఇదివరకే నేషల్ జీయోగ్రఫి అధికారులు వెల్లడించారు. తాజాగా మాస్కో పైరో తెగకు చెందిన ట్రైబర్స్ కెమెరాకు చిక్కారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
A tribe that wanders in the forests of Amazon.. The video is viral
Amazon forests: ఇప్పటికీ చాలా తెగలు బయట ప్రపంచం అంటే తెలియకుండా బతుకుతున్నారు. అలాంటి తెగలకు సంబంధించిన వార్తలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అమెజాన్ లాంటి అడవుల్లో ఇలాంటి తెగలు ఇంకా ఉన్నారు. తాజాగా ఆ పరిసర ప్రాంతాల్లో సంచరించే ఓ అరుదైన తెగ కెమెరాలకు చిక్కారు. దీంతో వారికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. పెరువియన్ అమెజాన్లో సంచరిస్తున్న ఈ తెగను మాష్కో పైరో అని పిలుస్తారని అధికారులు తెలిపారు. ఈ మేరకు సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే స్వదేశీ హక్కుల అడ్వకసీ గ్రూప్ వీరి వివరాలను, వీడియోలను రిలీజ్ చేశారు. వీరి గురించి అనేక విషయాలను వెల్లడించారు.
బయటప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా ఈ గిరిజన తెగ కేవలం అడవుల్లోనే జీవిస్తున్నట్లు చెప్పారు. పెరు దేశం దగ్గర్లోని లాస్ పీడ్రాస్ రివర్(Las Piedras River) సమీపంలో ఈ తెగ జీవిస్తున్నట్లు చెప్పారు. వీరిని మాస్కో పైరులు అంటారని, ఇన్నాళ్లు వారు అక్కడ ఉన్నారా లేదా అనే అనుమానం ఉండేదని ఇప్పుడు వారు అక్కడే ఉంటున్నట్లు సాక్ష్యాలు లభించినట్లు స్థానిక దేశీయ సంస్థ పెనామడ్ అధ్యక్షుడు ఆల్ఫ్రెడో వర్గాస్ పియో తెలిపారు. ఈ ప్రాంతాన్ని పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కొన్ని లాంగింగ్ కంపెనీలు ఆ ప్రాంతాన్ని విక్రయించందని ఆరోపించారు. ఆహారాన్ని వెతికే క్రమంలో ఈ తెగ కెమెరాలకు చిక్కినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మోంటే సాల్వడో, ప్యూర్టో న్యూవో సమీపంలో మారుగ్రామాలు ఉన్నాయని, వీరు బయటకు రావడంతో ఇరు వర్గాల మధ్య పోరాటాలు జరిగే అవకాశం ఉన్నట్లు పియో భావిస్తున్నారు.
Extraordinary new footage shows an Indigenous tribe, who are completely isolated from the outside world, on a riverbank in the Peruvian Amazon.
The Mashco Piro are the largest uncontacted Indigenous people in the world, but their lives and land are under serious threat due to… pic.twitter.com/gdNQM7AhKi