»World Wonders Seven World Wonders In Six Days World Record
World Wonders: ఆరు రోజుల్లోనే ఏడు ప్రపంచ వింతలు.. ప్రపంచ రికార్డు!
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏడు వింతలను తక్కువ సమయంలో సందర్శించి ఓ వ్యక్తి సరికొత్త రికార్డు సృష్టించారు. కేవలం ప్రజా రవాణాను మాత్రమే ఉపయోగించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు.
World Wonders: Seven world wonders in six days.. world record!
World Wonders: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏడు వింతలను తక్కువ సమయంలో సందర్శించి ఓ వ్యక్తి సరికొత్త రికార్డు సృష్టించారు. ఈజిప్టుకి చెందిన ఓ వ్యక్తి ఏడు వింతలను కేవలం ఆరున్నర రోజుల్లోనే చుశాడు. కేవలం ప్రజా రవాణాను మాత్రమే ఉపయోగించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. ప్రపంచంలోని ఏడు వింతలైన గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, పెట్రా, కోలోజియం, షింపెన్ ఇట్జా, మచు పిచు, తాజ్ మహల్, క్రీస్ట్ ఆఫ్ రిడీమర్‌ను మాగ్దే ఐసా కేవలం 6 రోజుల 11 గంటల 52 నిమిషాల్లో సందర్శించారు. ఈ యాత్రను గిన్నిస్ బుక్ గుర్తించింది. ఇంగ్లాండ్‌కు చెందిన జేమీ మెక్‌డొనాల్డ్ గతేడాది సాధించిన రికార్డును ఐసా ఇప్పుడు బద్దలుకొట్టారు.
తన టూర్‌ను ఐసా చైనాలోని గ్రేట్ వాల్‌తో మొదలుపెట్టి ఆ తర్వాత తాజ్‌మహల్, పెట్రా, కోలోజియం నుంచి క్రీస్ట్ ఆఫ్ రిడీమర్, మచు పిచు, షింపెన్ ఇట్జాను సందర్శించి తన యాత్రను ముగించారు. అయితే ఇతను ఈ యాత్రలో ఎక్కడా కూడా ప్రైవేటు వాహనాలను ఉపయోగించలేదు. ఈ టూర్ ప్లాన్ చేసుకోవడానికి అతనికి దాదాపుగా ఏడాదిన్నర సమయం పట్టిందట. విమానాలు, బస్సులు, రైళ్ల సమయాలను పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈ యాత్రను మొదలు పెట్టారట. ప్రపంచ వింతలను చూడాలన్నది తన చిన్ననాటి కల అని ఐసా చెబుతున్నారు.