అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. శ్రీశైలంలోని పాతల గంగ వద్ద వెలసిన చంద్రలింగాన్ని ఓ నాగు పాము చుట్టుకొని పడగ విప్పి దర్శనం ఇచ్చింది. చూడడానికి రెండు కళ్లు సరిపోవు అనేలా ఈ దృష్యం ఉంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
Cobra coiled around Chandra Linga in Srisailam field.. Here is the video!
Srisailam: దేశవ్యాప్తంగా శ్రీశైల మల్లికార్జునుడి దేవలయం గురించి తెలుసు. తాజగా ఆ స్వామివారి ఆలయంలో ఓ అద్భుతం చోటుచేసుకుంది. శివలింగాన్ని నాగుపాము చుట్టుకొని కనిపించింది. ఈ దృష్యాన్ని మొబైల్ ఫోన్లలో బంధించి నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా నల్లమల అడవుల్లో ప్రసిద్ధి గాంచిన క్షేత్రం శ్రీశైల. స్వామి వారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిగా భక్తులు తరలి వస్తారు. ఆలయంలో ఉన్న పాతాళ గంగ వద్ద చంద్రలింగం ఉంది. అది ప్రత్యక్ష వెలిసినట్లు అక్కడి భకత్తులు చెబుతారు. ఆ చంద్రలింగాన్ని దర్శించుకోవాడానికి వెళ్లిన భక్తులకు దాని చుట్టు పాము అల్లుకొని ఉండడం కనిపించింది. ఈ దృష్యాన్ని భక్తుల పావనంగా తిలకించారు.
పాము అలా లింగాన్ని చుట్టుకొని భక్తులు వస్తున్నారన్న బెరకు లేకుండా అలానే దీవిస్తున్నట్లు చూస్తోంది. దాంతో భక్తులు, అక్కడి అర్చకులు తన్మయత్వంతో వీక్షించారు. స్వయంగా స్వామి దగ్గరకు వాసుకినే వచ్చిందని మొక్కారు. దీనిపై ఆలయ నిర్వహకులు మాట్లాడుతూ.. ఇక్కడి అడవుల్లో పాములు తిరగడం సర్వసాధారణం కానీ ఇలా పడగవిప్పి లింగాన్ని చుట్టుకోవడం అనేది అనే అసాధారణం అని అన్నారు. ఈ సంఘటనను చూడడానికి రెండు కళ్లు సరిపోవడం లేదని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.