viral video.. Ai Fashion Show : ప్రపంచాన్ని శాసించే రాజకీయ నేతలు, టాప్ కంపెనీల నాయకులు ర్యాంప్ వాక్ చేస్తే ఎలా ఉంటుందంటారు? ఇదిగో అచ్చంగా ఇలాగే ఉంటుంది. నిజంగా ఇది అసాథ్యం కావచ్చు. కానీ అధునాత టెక్నాలజీ అయిన ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) వల్ల ఇది సాథ్యం అయ్యింది. ఈ వీడియోని టెస్లా సీఈఓ, ఎక్స్ అధినేత అయిన ఎలాన్ మస్క్(Elon Musk) తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. (Ai Fashion Show) ఏఐ ఫ్యాషన్‌షో ఎలా ఉంటుందో మనందరికీ చూపించారు.
చదవండి : మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్న వెండి, బంగారం ధరలు
ఈ వీడియాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, కమలాహారిస్, డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత జిన్‌పింగ్, కెనడా ప్రధాని ట్రుడో, అమెజాన్ సీఈఓ జఫ్ బెజోస్, మార్క్ జుకర్ బర్గ్, ఎలాన్ మస్క్(Elon Musk), బరాక్ ఒబామా, కిమ్ లాంటి వారంతా వింత వింత దుస్తులు ధరించి ఒకరి తర్వాత ఒకరు ర్యాంప్ వాక్ చేస్తున్నారు. ఇలా రూపొందించిన వీడియోని మస్క్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘హై టైం ఫర్ ఏన్ ఏఐ ఫ్యాషన్ షో’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
చదవండి : ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న బైడెన్
ఇది పోస్ట్ చేసిన కొద్ది సేపటికే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఎక్స్‌లో సైతం 55 మిలియన్ వ్యూస్‌ని సొంతం చేసుకుంది. నెటిజన్లు సైతం ఈ వీడియో కింద సరదా సరదాగా కామెంట్లు రాసేస్తూ ఆనందించేస్తున్నారు. మరింకెందుకు ఆలస్యం ఆ వైరల్ వీడియోపై(viral video) మీరూ ఓ లుక్కేసేయండి.
High time for an AI fashion show pic.twitter.com/ra6cHQ4AAu
— Elon Musk (@elonmusk) July 22, 2024

