NZB: చేపల అభివృద్ధిలో భాగంగా రుద్రూర్ మండలం అంబం (ఆర్) చెరువులో 80 ఎంఎం సైజ్ చేప పిల్లలను తహసీల్దార్ తారాబాయి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అంబం సర్పంచ్ కుర్లెపు గంగాధర్, రేపల్లి సాయి ప్రసాద్, బడే రాము, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు సాయిబాబా, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.