»The Model Who Posted Lunch Photo On Instagram The Assailants Came To The Location And Shot Dead
Viral News: ఇన్ స్టాలో లంచ్ ఫొటో పోస్ట్ చేసిన మోడల్.. లొకేషన్‌కు వచ్చి కాల్చి చంపిన దుండగులు
ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్టు ద్వారా ఓ మోడల్ అడ్రెస్ తెలుసుకున్న హంతకులు లోకేషన్‌కు వచ్చి తుపాకీతో కాల్చి చంపేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది.
The model who posted lunch photo on Instagram.. The assailants came to the location and shot dead
Viral News: ఓ మోడల్ లంచ్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేటస్ పెట్టుకుంది. అదే తన పాలిట యమపాశం అయింది. తను పెట్టిన లోకేషన్‌కు చేరుకున్న దుండగులు రెస్టారెంట్లో తన స్నేహితురాల్లతో మాట్లాడుతున్న సమయంలో తుపాకీతో కాల్చేసి వెళ్లిపోయారు. ఇదంత అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్‌లో 23 ఏళ్ల లాండీ పర్రాగా గోయ్ బురో అనే మోడల్ దారుణ హత్యకు గురైంది. దీనికి కారణం తాను లంచ్ చేస్తున్నట్లు ఫోటో పోస్టు చేయడమే. లంచ్‌లో ఆక్టోపస్ సెవిచే అనే ప్రత్యేకమైన డిష్ తింటున్నట్లు క్యాప్షన్‌తో పోస్టు పెట్టారు.
అదునుకోసం చూస్తున్న దుండగులకు ఆ ప్రత్యేకమైన వంటకం తయారు చేసే రెస్టారెంట్ తెలిసిపోయింది. దాంతో ఇద్దరు షూటర్లు అక్కడికి వచ్చారు. అదే సమయంలో వేరే వ్యక్తితో మాట్లాడుతుండగా తుపాకీతో కాల్పులు జరిపారు. తాను వెంటనే కింద పడడంతో దుండగులు అక్కడి నుంచి పరారు అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి గల పూర్తి కారణం తెలియలేదు. కానీ లియోనార్డో నోరెరొ అనే డ్రగ్ డీలర్‌తో ఎఫైర్ ఉంది. ఇటీవలే నోరెరొను జైల్లో హత్య చేశారు. అతని భార్యే లాండీని హత్య చేయించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Ecuadorian Beauty Queen Fatally Shot in Restaurant Ambush.
The attack, captured by CCTV, occurred as Landy Párraga Goyburo and a companion were standing at a table. Two gunmen burst into the restaurant, with one opening fire on Parraga and her companion. After the assailants… pic.twitter.com/7hUfCM4ci3