'మాస్ మహారాజా' రవితేజ ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను మొదలు పెట్టేస్తున్నాడు. ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్న మాస్ రాజా.. ఇప్పుడు కొత్త సినిమాను గ్రాండ్‌గా స్టార్ట్ చేశాడు. ఈ సినిమాలో శ్రీలీలతో కలిసి దావత్ ఇవ్వనున్నాడు రవితేజ.
RT75: ఉస్తాద్ భగత్ సింగ్‌కు పవర్ స్టార్ కాస్త గ్యాప్ ఇవ్వడంతో.. హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ సినిమా కమిట్ అయ్యాడు మాస్ మహారాజా రవితేజ. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేశాడు రవితేజ. ఇటీవలే రవితేజ 75వ సినిమాని ప్రకటించగా.. ఇప్పుడీ సినిమా పూజాకార్యక్రమం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ సినిమాతో మరో కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు రవితేజ. శ్రీవిష్ణు నటించిన ‘సామజవరగమన’ సినిమాకు రచయితగా పని చేసిన భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు.
RT75 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తుస్తోంది. గతంలో ఈ ఇద్దరు ధమాకా సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దీంతో.. మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని చుస్తున్నారు మేకర్స్. ఈసారి ఇద్దరు కలిసి ఇచ్చే దావత్ మామూలుగా ఉండదని అంటున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి.. ఈ సినిమాని 2025 సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మిస్టర్ బచ్చన్ షూటింగ్ పూర్తవగానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వనుంది. ఫుల్ లెంగ్త్ కామేడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. మరి మరోసారి ధమాకా జోడి ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.