ప్రస్తుతం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ 'కల్కి 2898 AD'. సలార్ వంటి మాసివ్ హిట్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా టికెట్ రేట్లు పెరగనున్నట్టుగా తెలుస్తోంది.
Kalki: ‘కల్కి 2898 ఏడి’ సినిమాను యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా.. మైథాలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దాదాపు 600 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టుగా సమాచారం. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీస్ దీపిక పదుకొనే, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తుండగా.. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లేటెస్ట్గా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయగా అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ సినిమాను జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఇప్పటికే యూఎస్‌లో కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవగా, నార్త్ అమెరికా ప్రీ సేల్స్ 500k డాలర్స్ మార్క్‌కు చేరుకున్నట్లు సమాచారం. రోజు రోజుకి ఈ లెక్క పెరుగుతునే ఉంది. ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా టికెట్లు పెరుగుతాయా? లేదా? అనే విషయంలో ఓ క్లారిటీ వచ్చేసినట్టే.
తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రుభుత్వాలు కల్కి సినిమాకు టికెట్స్ ధరలు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధర 200 నుండి 350 వరకు ఉండనున్నట్లు సమాచారం. మల్టీప్లెక్స్ స్క్రీన్లలో గరిష్టంగా 375 రూపాయలు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 250 ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. ఇక తెలంగాణలో గతంలో పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు బెనిఫిట్ షోలు, హైక్స్ బాగానే ఇచ్చారు. ఇప్పుడు కూడా ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు సింగిల్ స్క్రీన్లలో 236, మల్టీప్లెక్స్ స్క్రీన్లలో 413 రూపాయలుగా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఇక టికెట్స్ రేట్స్ పెరగడం మూలాన కల్కి సినిమాకు కలెక్షన్స్ భారీగా వచ్చే అవకాశం వుంది. ఇప్పటి వరకున్న ఓపెనింగ్స్ రికార్డ్స్ కల్కి సొంతం అయ్యేలా ఉందని అంటున్నారు. సినిమాకు ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా కల్కి పై కలెక్షన్ల వర్షం కురుస్తుందని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. మరి కల్కి బాక్సాఫీస్ దండయాత్ర ఎలా ఉంటుందో చూడాలి.