»Katrina Kaif Makes First Appearance Since Pregnancy Rumours Stuns In Black At Mumbai Airport
Katrina : తన ప్రగ్నెన్సీపై సీరియస్ కామెంట్స్ చేసిన కత్రినా కైఫ్
ఈ మధ్య సోషల్ మీడియాలో కత్రినా కైఫ్ ప్రగ్నెంట్ అంటూ కొన్ని ఫోటోలు హల్చల్ చేశాయి. వాటి గురించి స్వయంగా కత్రినా స్పందించారు. ఈ విషయమై స్పష్టత ఇచ్చారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే...?
Katrina Kaif : బాలీవుడ్ నటి కత్రినాకైఫ్, తన భర్త విక్కీ కౌశల్‌తో కలిసి లండన్ వెళ్లారు. అక్కడ ఆయన బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఆ జంట ఫోటో షూట్స్ చేసుకున్నారు. ఆ ఫోటోల్లో కత్రినా పొట్ట బేబీ బంప్ ఉన్నట్లు కనిపించింది. దీంతో ఆ ఫోటోలు నెట్లో తెగ వైరల్ అయ్యాయి. కత్రినా ప్రగ్నెంట్(Pregnancy) అంటూ పుకార్లు షికార్లు చేశాయి. దీంతో లండన్ నుంచి కత్రినా జంట ముంబయి ఎయిర్ పోర్ట్‌లో(Mumbai Airport) దిగగానే అక్కడ ఫోటో గ్రాఫర్లు ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దీంతో వారిపై కత్రినా(Katrina) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
‘నేను ప్రగ్నెంట్ అనుకుని ముంబయి ఎయిర్ పోర్ట్‌లో చాలా మంది ఫోటోగ్రాఫర్లు ఎదురు చూశారు. అక్కడ నన్ను ఫోటోలు తీయడానికి వారంతా ప్లాన్ చేసుకున్నారు. అయితే నేను ప్రగ్నెంట్‌గా కాకుండా మామూలుగానే రావడంతో వారు నన్ను చూసి షాకయ్యారు. వారి అవస్థ చూసి నాకు చాలా నవ్వొచ్చింది. లండన్‌లో ఫోటోగ్రాఫర్ల తప్పిదం వల్ల మాత్రమే కొన్ని ఫోటోలు అలా బేబీ బంప్ ఉన్నట్లు వచ్చాయి. అయినా నా ప్రగ్నెన్నీ నా ఇష్టం. దేశానికి దాని వల్ల ఉపయోగం ఏం లేదు కదా. నా ప్రగ్నెన్సీ గురించి వాళ్లకెందుకు? వార్తలు ఎలా ఉండాలో తెలియని వాళ్లు న్యూస్ కవర్ చేస్తున్నారు. అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతోంది’. అంటూ కత్రినా కైఫ్ (Katrina Kaif) చురకలంటించారు.