KMR: మండలం గర్గుల్ గ్రామంలో గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆంజనేయస్వామి ఆలయంలో వేదమంత్రాల మధ్య పూజలు చేసి, ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రార్థనలు చేశారు.