E.G: ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ & EX MLA బూరుగుపల్లి శేషారావు శుక్రవారం “ప్రజాదర్బార్” కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ సమస్యలతో నియోజకవర్గం నలుమూలల నుండి తరలివచ్చిన ప్రజలు, నాయకులను ఆప్యాయంగా పలకరించి, వారి సమస్యలను స్వయంగా తెలుసుకుని అర్జీలను స్వీకరించారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.