»Union Finance Minister Nirmala Sitharaman Responds On Special Status To Bihar
Special Status : ప్రత్యేక హోదాపై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు
దేశంలోని అనేక వెనకబడిన రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోసం డిమాండు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..?
Nirmala Sitharaman On Special Status : వెనకబాటుతో ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించాలంటూ ఇప్పటికే పలు రాష్ట్రాలు డిమాండ్లు చేస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఇలాగే తమకు ప్రత్యేక హోదాSpecial Status) కల్పించాలంటూ అడుగుతోంది. అయితే బీహార్ చేస్తున్న డిమాండుపై మాత్రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఆ విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు మాదిరిగానే బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలన్న విషయం ఎప్పటి నుంచో నలుగుతూ ఉంది. బీహార్( Bihar) బీసీలు, పేదలు అధికంగా ఉన్నారు. దీంతో ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలంటే తమ రాష్ట్రాలనికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆ రాష్ట్ర ఎప్పటి నుంచో కేంద్రాన్ని కోరుతోంది. పాట్నాలో విలేఖరులు సమావేశంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయమై మాట్లాడారు.
బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని నిర్మలా సీతారామన్ ( Nirmala Sitharaman) వ్యాఖ్యానించారు. తూర్పు రాష్ట్రాల అభివృద్ధికి బీజేపీ ఎప్పుడూ కట్టుబడి ఉందన్నారు. 2047 నాటికి భారత్‌ను పూర్తి అభివృద్ధి చెందిన దేశంగా మలిచే క్రమంలో బీహార్, ఒడిశా, బెంగాల్ లాంటి రాష్ట్రాలను అభివృద్ధి కేంద్రాలుగా మార్చేందుకు కేంద్రం యోచిస్తోందని చెప్పుకొచ్చారు. ఆటవిక పాలనతో బీహార్ అభివృద్ధి దారుణంగా ప్రభావితం అయ్యిందని అన్నారు.