Anant Weds Radhika : భారతీయ సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ(Anant Ambani) ప్రీ వెడ్డింగ్ వేడుకలు మరోసారి భారీ క్రూయిజ్‌లో జరగనున్నాయి. ఇందుకు ఇటలీలో ఓ లగ్జరీ క్రూయిజ్ సిద్ధం అయ్యింది. ఇటలీ నుంచి దక్షిణ ఫ్రాన్స్ వరకు దాదాపు 4,380 కిలోమీటర్ల ఈ క్రూయిజ్‌లో ప్రయాణిస్తూ వీరు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ని జరుపుకోనున్నారు. మే 28న మొదలయ్యే ఈ వేడుకలు జూన్ 1న ముగుస్తాయి.
ఈ ఈవెంట్ మొత్తం సముద్రం పైనే జరగనుంది. ఈ క్రూయిజ్‌లో మొత్తం 800 మంది అతిథులకు అంబానీ ఫ్యామిలీ ఆతిథ్యం ఇవ్వనుంది. వారందరికీ ఏ లోటూ రాకుండా చూసుకునేందుకు అందులో 600 మంది సిబ్బంది పని చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ రెండో సారి ఇలా లగ్జరీ క్రూయిజ్‌లో ప్రీ వెడ్డింగ్(pre Wedding ) వేడుకలు జరగనున్నాయి. ఇందుకు రాబోయే అతిథుల లిస్ట్ ఇప్పటికే ఖరారైంది. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, ఆమీర్ ఖాన్, అలియా భట్ లాంటి సినీ ప్రముఖులతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలు, వీవీఐపీలు, అంబానీ కుటుంబ సభ్యులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు. అందుకుగాను ఇప్పటికే అక్కడ పనులు మొదలైనట్లు వార్తలు వెలువడుతున్నాయి.
అనంత్ అంబానీ(Anant Ambani), రాధికా మర్చెంట్ని(Radhika Merchant) జూలై 12వ తేదీన వివాహం చేసుకోబోతున్నారు. ఆ వివాహానికి ముందుగా మొదటి సారి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. ఆ వేడుకలకు అంబానీ రూ.1200కోట్లు ఖర్చు చేశారని ఫోర్బ్స్ మ్యాగజైన్ వెల్లడించింది. ఇప్పుడు మళ్లీ రెండోసారి సముద్రంపై జరిగే ప్రీ వెడ్డింగ్ వేడుకలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.