Prasanth Neel: మళ్లీ మొదటికొచ్చిన ‘ప్రశాంత్ నీల్’ వ్యవహారం?
ప్రస్తుతం కల్కి జోష్‌లో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్‌కు, సలార్ 2 అప్డేట్ డబుల్ కిక్ ఇచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ వ్యవహారం మొదటికొచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో.. ప్రభాస్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
Prasanth Neel: ఆగష్టు 10 నుంచి సలార్ 2 షూటింగ్ స్టార్ట్ కానుంది.. రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్లో 15 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందనే వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు మళ్లీ మొదటికొచ్చింది వ్యవహారం. సలార్ 2 కంటే ముందు ప్రశాంత్ నీల్ NTR 31 సినిమా స్టార్ చేస్తాడరనే ప్రచారం మొదలైంది. కాదు.. కాదు.. సలార్ 2 తో పాటు ఎన్టీఆర్ సినిమాని కూడా సమాంతరంగా పూర్తి చేస్తాడనే టాక్ కూడా ఊపందుకుంది. దీంతో.. ఏ సినిమా ముందు సెట్స్ పైకి వెళ్లనుంది? అనేది డైలమాలో పడిపోయింది.
ప్రశాంత్ నీల్ కూడా డైలామాలోనే ఉన్నట్టుగా చెబుతున్నారు. అంతేకాదు.. ఈ విషయంలో ప్రశాంత్ నీల్ మీద ఒత్తిడి ఉందనే మాట కూడా వినిపిస్తోంది. దీంతో.. అభిమానులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అయితే.. ఆల్రెడీ ‘సలార్’ సీక్వెల్ షూటింగ్ 20 శాతం పూర్తయింది కాబట్టి, రెండు చిత్రాల షూటింగ్స్ ప్యారలల్‌గా చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటికీ సలార్ కోసం వేసిన సెట్స్ అలాగే ఉన్నాయి. కాబట్టి.. సలార్ 2తో పాటు ఎన్టీఆర్ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ కానుందని అంటున్నారు.
ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ వారు ఆగష్టు నుంచి ఎన్టీఆర్, నీల్ సినిమా ఉంటుందని ప్రకటించారు. దేవర షూటింగ్ చివరి దశకు చేరుకుంది కాబట్టి.. వార్ 2ని కూడా వీలైనంత త్వరగా పూర్తయ్యేలా తారక్ ప్లాన్ చేస్తున్నాడు. ప్రభాస్ మాత్రం సలార్2ని ఈ ఏడాదిలోనే కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు. హోంబలే ఫిలింస్ కూడా సలార్2ని వచ్చే ఏడాదిలోనే రిలీజ్ చేసి తీరుతామని చెబుతున్నారు. కాబట్టి.. ప్రశాంత్ నీల్ దీనిపై ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి.